Pages

Aug 17, 2010

టిప్పులు! తిప్పలు!

ఈరోజు సాయంత్రం హైదరాబాదులో కురిసిన వర్షానికి హైటెక్‌సిటీకి కూకట్‌పల్లికి మధ్య దారి పూర్తిగా మూసేశారు. దాని వలన కొండాపూర్ నుంచి మియాపూర్‌కి వెళ్ళే దారిలో traffic చాలా ఎక్కువ అయ్యింది. దాదాపు తొమ్మిదిన్నరకి ఆఫీసు నుంచి బయటపడితే శిల్పారామం దాటేసరికి పది అయ్యింది. మా cab driver కొంచెం సమయస్ఫూర్తితో బండిని వెనక్కి తిప్పేసి బోరబండ వైపు తీసుకెళ్ళాడు. దారి నిండా ఎక్కడ చూసినా గతుకులు, గతుకుల నిండా నీళ్ళు. తనకి తెలిసిన ప్రతి సందులోకీ బండి తిప్పుకుంటూ తిన్నగా మూసాపేట్ దగ్గర బండిని బయటకి తేల్చాడు. అక్కడి నుంచి మళ్ళీ డొంకదార్లు పట్టి malaysian township దగ్గరకి తీసుకొచ్చాడు. అంతా గంటలో చేశాడు. ఇదంతా చేస్తున్నంతసేపూ అతని మొహంలో ఏమాత్రం విసుగులేదు. ఏదో ఒకటి మాట్లాడుతూ అందరికీ కొంచెం కాలక్షేపం కూడా కల్పించాడు. గంటసేపట్లో trafficలో ఎక్కడా ఆగకుండా మా అందరినీ (malaysian township, వసంత్‌నగర్, నిజాంపేట్ లో) దింపేశాడు. మనస్పూర్తిగా చాలా బలంగా thanks చెప్పాలని అనిపించింది. కానీ ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. ఒక వంద రూపాయిలు tip ఇచ్చి, good night చెప్పి, thanks చెప్పాను. అతను కూడా నవ్వుతూనే thanks చెప్పాడు. కానీ ఎందుకో ఒక తెలియని వెలితి - మా కోసం ఒక గంటసేపు అంత కష్టపడి, ఏమాత్రం విసుక్కోకుండా ఉన్న మనిషితో ఒక రెండు నిముషాలైనా సరిగా మాట్లాడి, అతను చేసిన పని విలువ ఏమిటో చెప్పలేకపోయానని. చేసిన పనిని మెచ్చుకుంటే ఎవరికైనా చాలా ఆనందం కలుగుతుంది కదా! ఎందుకో డబ్బులిచ్చి thanks సరిగా చెప్పని ఈ tipping culture మీద కొంచెం చిరాకు కలిగింది.

Aug 15, 2010

రొట్టెముక్క! రంగునీళ్ళు!

మా apartment complexలో స్వాతంత్ర్యదినం సందర్భంగా ఏదో చిన్న వేడుక చేశారు. మా తాతగారు అక్కడికి వెళ్ళి వచ్చారు. వెళ్ళి చాలాసేపు అయ్యింది గనుక ఆయనకి ఆకలి వేస్తుందేమో అనుకున్నాను.
నేను: "ఆకలేస్తుందా? ఏమైనా తింటారా?"
తాతగారు: "లేదు లేరా! అక్కడ వాళ్ళు ఏదో రొట్టెముక్క పెట్టి రంగునీళ్ళు ఇచ్చారు."
నాకు అర్ధం కావడానికి కాసేపు పట్టింది. ఆయన భావం ఇది. :-)
  • "రొట్టెముక్క" = cake
  • "రంగునీళ్ళు" = cool drink

Nov 5, 2009

How do I

Link: http://www.india.gov.in/howdo/index.php
Someone posted this on one of the mailing lists at work. It is supposed to be your one-stop location to find out how to get help from different government agencies.

I like the initiative, and wish that they take enough care to keep it up to date.